ఢిల్లీలో ఘనంగా పద్మ పురస్కారాల ప్రదానం
- March 20, 2018
రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ పలువురు ప్రముఖులకు మంగళవారం పద్మ అవార్డులు ప్రదానం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ వేడుకలో పద్మ అవార్డు గ్రహీతలు రాష్ట్రపతి చేతుల మీదగా అవార్డులు అందుకున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా, క్రికెటర్ మహేంద్రసింగ్ ధోని, బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్‌తోపాటు పలువురు అవార్డు గ్రహీతలు పద్మ పురస్కారాలు అందుకున్నారు. ఈ కార్యక్రమానికి ఉప రాష్ర్టపతి వెంకయ్య నాయుడితో పాటు, ప్రధాని నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్ సమిత్రా మహాజన్, కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో పాటు ఇతర ప్రముఖలు హాజరయ్యారు. 69వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్రం 3గురికి పద్మ విభూషణ్, 9 మందికి పద్మ భూషణ్, 73 మందికి పద్మశ్రీ ప్రకటించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!







