ప్రయాణికులు, పాదచారులను అప్రమత్తం చేయడానికి సౌదీ రైల్వే భద్రతా ప్రచారం

- March 20, 2018 , by Maagulf
ప్రయాణికులు, పాదచారులను అప్రమత్తం చేయడానికి  సౌదీ రైల్వే భద్రతా ప్రచారం

జెడ్డా :  రైల్వే లైన్ల సమీపంలో కొందరు ప్రజల ప్రమాదకరమైన ప్రవర్తన గురించి అవగాహన కల్పించడానికి "రైల్వే భద్రత" అనే నినాటం పేరిట సౌదీ రైల్వే కంపెనీ (ఎస్ ఏ ఆర్) ఒక అవగాహన ప్రచారం ప్రారంభించింది. సౌదీ రైల్వే కంపెనీ మార్కెటింగ్ మరియు సమాచార డైరెక్టర్ జనరల్ అమ్మార్ అల్-నహడి మాట్లాడుతూ, హైల్  మరియు అల్-జౌఫ్ల మధ్య ప్రాంతంలో పలు గ్రామాలను మరియు నగరాలను లక్ష్యంగా చేసుకొని  సంస్థ అవగాహన ప్రచారాన్ని ఆరంభించిందని అన్నారు. ఇక్కడ ప్రధానంగా రైల్వేమార్గం దారుణంగా దెబ్బ తింది. ఈ ప్రదేశాల మధ్య విశాలమైన గడ్డి మైదానాలు మరియు పశువులు ఎక్కువగా ఉన్నాయి. "ఈ తప్పు ప్రవర్తనల కారణంగా  ప్రజలు తమ మనస్సాక్షిని కోల్పోతున్నారు వారి పనుల తీవ్రత వలన అమాయక ప్రజలను అన్యాయంగా హతమార్చడానికి దారితీస్తుంది. ఇక్కడ ప్రయాణీకులు తప్పు మార్గంలో రైల్వే ట్రాక్ లను దాటడం ఒక ప్రధాన కారణం. సౌదీ రైల్వే కంపెనీ (ఎస్ ఏ ఆర్)  ప్రజల మరియు ఆస్తి యొక్క రక్షణకు అత్యధిక  ప్రాధాన్యత ఇస్తూ, ప్రయాణికుల భద్రత రైల్వే ట్రాక్ చుట్టూ నివసిస్తున్న ప్రజలను రక్షించడానికి  రైల్వేలు పరిగణన లోనికి తీసుకొంటుందని అల్-నహడి అన్నారు, హైల్ , అల్-జౌఫ్ ప్రాంతాల మధ్య ప్రజల సంక్షేమం పట్ల శ్రద్ధ వహించడానికి ఎన్నో నిర్మాణాలు చేపట్టిందన్నారు. వాహనాలు పశువులు ట్రాక్ పై నుంచి  దాటివెళ్లడం కోసం నిర్మించిన వంతెనలను ఉపయోగించాలని ప్రజలకు విజ్ఞప్తి  చేసింది. ప్రయాణికుల భద్రత మరియు వారి రక్షణ కోసం 4,974 కిలోమీటర్ల కంచె వేయబడిన రైల్వేలు, ఉత్తరాన 2,750 కిలోమీటర్లు మరియు డమ్మామ్ మరియు రియాద్ మధ్య 1,775 కిలోమీటర్లు, మక్కా మరియు మదీనా మధ్య ఎక్స్ ప్రెస్  రైలుకు 450 కి.మీ. ఏర్పాటుచేయబడింది. ప్రజలు వారి ఆస్తి  భద్రత ను మరియు రక్షణ కల్పించడానికి  రైల్వే ట్రాక్ పక్కన రెండు వైపులా రక్షణ కంచె నిర్మించినట్లు ఆయన తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com