అలరించనున్న రంభ
- March 21, 2018చెన్నై: 1990లలో తెలుగు, తమిళ పరిశ్రమను తన అందం, అభినయంతో మెప్పించిన నటి రంభ. రజనీకాంత్, కమల్, చిరంజీవి, విజయ్, అజిత్, కార్తిక్, ప్రభు.. ఇలా పెద్ద హీరోలతో నటించి మెప్పించారు. 15 ఏళ్ల క్రితమే నటనకు కాస్త బ్రేక్ ఇచ్చారు రంభ. పెళ్లి తర్వాత భర్త, పిల్లలతో పాటు కెనడాలో స్థిరపడ్డారు. పలు కారణాలతో మళ్లీ చెన్నైకి వచ్చి కొన్ని టీవీ కార్యక్రమాల్లో న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. ఇప్పుడు మళ్లీ సినిమాల్లో నటించడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. సాధారణంగా సీనియర్ నటీమణులు రీ ఎంట్రీ ఇస్తే తల్లి పాత్రల్లోనే అధికంగా కనిపిస్తారు. కానీ రంభ అందుకు భిన్నమైన పాత్రలో కనిపించనుందని సమాచారం. తాజాగా ఓ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నారని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే అది ఎలాంటి పాత్ర అనేది ఇంకా స్పష్టం కాలేదు. తెలుగులోను అవకాశాల కోసం రంభ ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
తాజా వార్తలు
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్
- టీమిండియా కోచ్ రేసులో ఇద్దరు విదేశీయులు..
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్‌లైన్స్
- స్పామ్ కాల్స్‌కు ఇక గుడ్‌బై..
- సిబిఎస్ఇ లో రాణించిన భారత పాఠశాల విద్యార్థులు
- మరో ఘనతకు సిద్ధమవుతున్న కువైట్ ఎయిర్ పోర్ట్..!
- సౌదీలో SR3000 గరిష్ఠ డ్యూటీ ఫ్రీ పరిమితి విధింపు
- వావ్.. దుబాయ్ కొత్త విమానాశ్రయం ఫోటోస్ ఔట్
- ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం
- యూఏఈలో పురాతన నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణ