రస్ అల్ ఖైమాలో విధించిన జరిమానాలపై 30 శాతం డిస్కౌంట్
- March 21, 2018రస్ అల్ ఖైమా : విధించిన జరిమానాలపై మార్చి 20 వ తేదీ నుండి 22 వ తేదీ వరకు చెల్లుబాటు అయ్యే విధంగా 30 శాతం డిస్కౌంట్ ను రస్ అల్ ఖైమా పబ్లిక్ సర్వీస్ డిపార్ట్మెంట్ మూడు రోజుల డిస్కౌంట్ ప్రకటించింది. ఈ సదుపాయం వరల్డ్ హ్యాపీనెస్ డే సందర్భంగా ఉద్దేశించబడింది. డైరెక్టర్ జనరల్ డిపార్ట్మెంట్ ఇంజినీర్ అహ్మద్ మొహమ్మద్ అహ్మద్ అల్ హమ్మాడి తెలిపిన వివరాల ప్రకారం."పర్యావరణ వ్యతిరేక ఉల్లంఘనలకు మాత్రమే ఈ డిస్కౌంట్ వర్తిస్తుందని అన్నారు. పర్యావరణాన్ని కాపాడుకునేందుకు ప్రజలకు తెలియచేస్తూ , పర్యావరణానికి సంబంధించి ఏ ఉల్లంఘనను నివేదించామని, ఉద్యోగులందరూ తమ తమ సంతోషాన్ని పంచుకునేందుకు వారికి వివిధ బహుమతులు పంపిణీ చేశారు. "స్ఫూర్తిదాయకమైన పని వాతావరణానికి ప్రధాన లక్షణాలలో సంతోషం అనేది ఒకటి. "సంతోషంగా ఉన్న ఉద్యోగి బంధనాల నుండి వెలుపలకు వచ్చి ఆలోచించగలడు అలాగే ,వినియోగదారులకు ఆనందం కలిగించగలడు." అదేవిధంగా రాస్ అల్ ఖైమా లో ప్రతి ఇంటికి మొక్కను సమర్పించటానికి ఒక నూతన కార్యక్రమం ప్రారంభించబడింది. " వరల్డ్ హ్యాపీనెస్ డే మరియు జాయేద్ ఇయర్, ఎమిరేట్ లో పచ్చని ప్రాంతాలు వ్యాపించడానికి ఎంతో సహాయం పడుతుంది. ప్రజలకు సంతోషం పంచడమే కాక వారిని పర్యావరణ రక్షణలో భాగస్వామిగా ఉండేందుకు తాము ప్రోత్సహిస్తున్నట్లు ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- శుభవార్త. కొత్తగా 10 ఏళ్ల బ్లూ రెసిడెన్సీ వీసా
- అరబ్ సమ్మిట్. గాజా సంక్షోభం, పాలస్తీనా గుర్తింపుపై ఫోకస్..!
- PACI సందర్శకులకు శుభవార్త..!
- ఒమన్ పీస్ బిల్డర్.. UN సెక్రటరీ జనరల్ ప్రశంసలు
- అనుమతి లేకుండా హజ్.. SR100,000 వరకు ఫైన్..!
- 'దుబాయ్ అన్లాక్డ్' క్లెయిమ్‌లను కొట్టిపారేసిన యూఏఈ..!
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్
- టీమిండియా కోచ్ రేసులో ఇద్దరు విదేశీయులు..
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్‌లైన్స్
- స్పామ్ కాల్స్‌కు ఇక గుడ్‌బై..