ఏప్రిల్ 12నుంచి రెగ్యులర్ షూటింగ్ లో తారక్, త్రివిక్రమ్ మూవీ
- March 21, 2018
జైలవకుశ వచ్చి ఆరు నెలలవుతున్నా..యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొత్త సినిమాని ఇంకా పట్టాలెక్కించలేదు. కేవలం త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేసే సినిమా కోసమే ఇన్నాళ్ళూ వెయిట్ చేశాడు తారక్. ఈ క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కే సినిమా రెగ్యులర్ షూటింగ్ కి డేట్ ఫిక్స్ అయ్యింది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ మళ్ళీ షూటింగ్ తో బిజీ అవ్వబోతున్నాడు. తన రీసెంట్ మూవీ జైలవకుశ వచ్చి దాదాపు ఆరు నెలలు అవుతోంది. ఇంత గ్యాప్ తీసుకున్న తారక్, ఏప్రిల్ 12నుంచి తన కొత్త సినిమా రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు.
త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా హారికా అండ్ హాసిని సంస్థలో రూపొందే సినిమా...నిజానికి ఎప్పుడో లాంచనంగా ప్రారంభమైంది. కానీ అజ్ఞాతవాసి నిరాశపరచడంతో త్రివిక్రమ్, మరొకసారి స్టోరీని పక్కాగా సెట్ చేసుకుని, సెట్స్ పైకి వెళదాం అని డిసైజ్ అయ్యాడని తెలుస్తోంది. అందుకే ఇంత లేట్ అయ్యింది.
ఏప్రిల్ 12నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయబోతోంది టీమ్. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ కొద్ది రోజులుగా జిమ్ లోనే గడుపుతున్నాడు. తారక్ కి జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్నాడు. మిగతా విషయాలేవి బయటకు తెలియనీయకుండా జాగ్రత్తపడుతున్నారు యూనిట్ సభ్యులు. ఈ ఏడాదిలోనే ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నారు.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!