'గోరువంక' గా మారిన 'గొల్లభామ'
- March 21, 2018
సినిమా రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు రావాలంటే పెద్ద పరీక్షే ఈ రోజుల్లో..ఎందుకంటే ఎప్పుడు ఎవరి ఎలా వారి మనోభావాలు దెబ్బ తీసుకుంటారో అర్దం కావడంలేదు.ఒక సీన్ వస్తే ఫలానా వారిని కించపరిచారంటూ కంప్లైంట్..డైలాగ్ వినిపిస్తే మా కులాన్ని తిట్టారంటూ కేసు నమోదు..ఆఖరుకి పాటల్లో చిన్న చిన్న పదాలను కూడా వివాదస్పదం చేస్తూ ఉంటే. రచయితలకు పెద్ద పరీక్ష కాక మరేమిటి..అందుకే ఎంతో క్షుణ్ణంగా ఆచితూచి అడుగులేస్తున్నారు.ఎంతో పక్కా ప్లాన్ తో ఫర్ఫెక్ట్ గా ముందుకు వెళ్లే మన లెక్కల మాష్టారు సుకుమార్ గారి సినిమాకు కూడా బ్రేకులు పడ్డాయి.. దాన్ని సుక్కు ఎలా క్లియర్ చేశారో తెలుసా.?
రంగమ్మ.మంగమ్మ. ఏం పిల్లడు పక్కనే ఉంటాడమ్మా పట్టించుకోడు..రంగస్థలంలోని ఈ పాట ఇటీవలి కాలంలో ప్రేక్షకులను ఉర్రూతలూగించింది .అయితే ఈ పాటలో గొల్లభామ అనే ఒక పదం తమ కులం వారిని కించపరిచే విధంగా ఉందంటూ విమర్శలొచ్చాయి.దాంతో సుక్కు వెంటనే అలర్ట్ అయ్యారు..ఆ పదానికి సంభందించి వివరణ ఇచ్చారు.మరోవైపు సోషల్ మీడియాలో కూడా దీనిపై పెద్దఎత్తున విమర్శలొచ్చాయి.గొల్లభామ అనే పురుగుకి ,గొల్లల కులానికి సంభందం ఏంట్రా బాబు అంటూ బహిరంగంగానే విమర్శించారు చాలా మంది.
సుకుమార్ వివరణ ఇచ్చినప్పటికి సదరు మనోభావాలు గాయపర్చుకున్నవారు వెనక్కి తగ్గకపోవడంతో..ఈ వివాదాన్ని ఇక్కడితో ఆపేయాలని అనుకున్నారు సుకుమార్..దాంతో ఆ పాటలో గొల్లభామ అని వచ్చే చోట గోరువంక అని మార్చారు..ప్రస్తుతం ఆడియో లో గొల్లభామ వినిపించిన కానీ సినిమాలో మాత్రం గొల్లభామ బదులు గోరువంక అని వినిపిస్తుంది..గతంలో దువ్వాడ జగన్నాధమ్ సినిమాలో కూడా గుడిలో ఒడిలో పాటలో పదాలు మార్చాలని వివాదం అవ్వడం,దర్శకుడు మార్చడం మనకు తెలిసిందే..
తాజా వార్తలు
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!







