కొత్త సేవలతో ఐఆర్‌సిటిసి
- March 21, 2018
న్యూఢిల్లీ: ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సిటిసి) ప్రధాన క్యాబ్ అగ్రిగేటర్ ఓలాతో ఒక భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. దీనిప్రకారం ఐఆర్‌సిటిసి వెబ్‌సైట్, యాప్‌ద్వారా కూడా ఓలా క్యాబ్ సేవలను పొందే సౌకర్యాన్ని కల్పిస్తున్నామని ప్రకటించింది. ఆరునెలల పైలట్ ప్రాజెక్టుగా దీన్ని ప్రారంభించినట్లుగా తెలిపింది. తాజా ఒప్పందం ప్రకారం ఐఆర్‌సిటిసి రైల్ కనెక్ట్ మొబైల్ అప్లికేషన్, వెబ్‌సైట్‌లో ఓలా క్యాబ్ బుక్ చేసుకునేందుకు వీలు కల్పించింది. ఓలా యాప్‌లో అందుబాటులో ఉన్న ధరల్లోనే ఓలా మైక్రో, ఓలా మినీ, ఓలా ఆటో, ఓలా షేర్ సేవలను నేరుగా బుక్‌చేసుకునేందుకు కూడా ప్రయాణికులకు అనుమతి ఉందని ఒక ప్రకటనలో స్పష్టంచేసింది. కాగా వివిధ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఓలా, ఉబెర్ డ్రైవర్లు దేశవ్యాప్త సమ్మె చేపట్టాయి.
తాజా వార్తలు
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!







