బొకోహరమ్ చెర నుంచి బాలికలకు విముక్తి
- March 21, 2018
అబూజా: ఫిబ్రవరిలో కిడ్నాప్ చేసిన బాలికలను బొకోహారం ఉగ్రవాదులు బుధవారం విడుదల చేశారు. ఈశాన్య డాప్సి పట్టణంలో బొకోహారం ఉగ్రవాదులు కిడ్నాప్ చేసిన వారిలో 76 మంది బాలికలు సురక్షితంగా విడుదలయ్యారని సమాచార శాఖ మంత్రి లారు మహ్మద్ వెల్లడించారు. బొకోహారం ఉగ్రవాదులు, నైజీరియన్ ప్రభుత్వానికి మధ్య చర్చలు సఫలం కావడంతో తీవ్రవాదులు బాలికలను విడిచిపెట్టారని తెలిపారు. కొంతమంది మిత్రుల సాయంతో కిడ్నాప్‌నకు గురైన బాలికలను సురక్షితంగా కాపాడామని పేర్కొన్నారు. అయితే బొకోహారం తీవ్రవాదులు ఎవరికి అవకాశం ఇవ్వకుండా బాలికలను కిడ్నాప్ చేసిన స్కూల్ దగ్గర వదిలిపెట్టి వెళ్లారని కిడ్నాప్‌నకు గురైన బాలికల తల్లిదండ్రుల గ్రూప్‌నకు చెందిన వ్యక్తి ఒకరు తెలిపారు. బాలికలను వాహనాల్లో తీసుకువచ్చి స్కూల్ వద్ద వదిలి వెళ్లినట్టు తెలిపారు. నైజీరియాతోపాటు లేక్ ఛాడ్ ప్రాంతాల్లో బొకోహారం ఉగ్రవాదులు తమ కార్యకలాపాలను కొనసాగించేందుకు అవసరమైన నిధుల కోసం కిడ్నాప్‌ను అస్త్రంగా వాడుకొని ప్రభుత్వంపై బెదిరింపులకు పాల్పడ్డారు. మొత్తం 110 మంది బాలికలు కిడ్నాప్ అయ్యారంటూ వార్తలు వస్తున్నాయి. అయితే నైజీరియా అధికారులు మాత్రం ఎంతమంది బాలికలు కిడ్నాప్‌నకు గురయ్యారనే విషయంపై ఆరా తీస్తున్నారు.
తాజా వార్తలు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్







