తప్పులు జరిగాయి..ఫేస్‌బుక్ సిఇవో జుకెర్
- March 21, 2018
వాషింగ్‌టన్ : తన కంపెనీలోని 50 మిలియన్ వినియోగదారుల వివరాల సమీకరణలో తప్పులు జరిగాయని ఫేస్‌బుక్ లింక్స్ నిర్వాహకుడు మార్క్ జుకెర్‌బర్గ్ అంగీకరించారు. అలాంటి సమాచారాన్ని అభివృద్ధి చేసే వారి యాక్సెస్‌ను పరిమితం చేసేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటామన్నారు. గత నాలుగు రోజులుగా ఫేస్‌బుక్‌పై పలు వివాదాంశ వార్తలు రావడంతో ఫేస్‌బుక్ ఛీప్ ఎగ్జిక్యూటివ్ జుకెర్‌బర్గ్ స్పందించారు. ప్రపంచంలోని అతిపెద్ద సోషల్‌మీడియా ఫేస్‌బుక్ నెట్వర్క్‌పై విజిల్బోయర్ ఆరోపణల నేపథ్యంలో ఐరోపా, అమెరికా దేశాల ప్రభుత్వాలు పరిశీలిస్తున్నాయన్నారు. ఫేస్‌బుక్ సంస్థ ట్రంప్ కనెక్ట్ అయిన డేటా మైనింగ్ సంస్థతో కూడిన కుంభకోణంలో వినియోగదారుల డేటాను రక్షించడానికి అవసరమైన చర్యల్ని తీసుకుంటామన్నారు. లండన్‌లోని 'కేంబ్రిడ్జ్ ఎనలిటికా సాగా' నుండి డేటాను రక్షించే బాధ్యత తమకుందని, అది విఫలమైతే తాము సేవ చేయటానికి అర్హత కోల్పోతామని జుకెర్‌బర్గ్ వెల్లడించారు.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!