ఇండియన్ టెక్నోమాక్ కుంభకోణం
- March 21, 2018
సిమ్లా: సుమారు రూ. 6,000 కోట్లు మోసం కేసులో పవొంట సాహిబ్ ప్రాంతంలోని ఇండియన్ టెక్నో మాక్ కంపెనీ డైరెక్టర్‌ను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఐఎఎస్ ఆఫీసర్ ఎమ్‌ఎల్. శర్మ కుమారుడు, కంపెనీ డైరెక్టర్ అయిన వినరు కుమార్ శర్మను పోలీసులు కోర్టులో హాజరు పరచగా, కోర్టు అతనికి ఈనెల 24 వరకు సిఐడి కస్టడీని విధించినట్లు పోలీసులు తెలిపారు. ఈ సంస్థ 2014, మార్చ్‌లో కార్యకలాపాల్ని రహస్యంగా మూసివేసిందని, అధికారులు పవొంట సాహిబ్‌లోని జగత్పూర్ గ్రామంలోని సిబ్బందికి వేతనాలు చెల్లించలేదని, అలాగే ఆదాయపుపన్ను, సేల్స్ టాక్స్, విద్యుత్ ఛార్జీల్ని చెల్లించలేదని పేర్కొన్నారు. నాలుగేళ్లుగా హిమాచల్ ప్రదేశ్‌లో ఈ కంపెనీపై దర్యాప్తు చేయగా రాష్ట్రంలో అతిపెద్ద ఆర్థికమోసాలలో ఒకటిగా బయటపడిందని అధికారులు పేర్కొన్నారు. ఈ కంపెనీ ఎండి రమేష్ శర్మ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నామని చెప్పారు. పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం వెలుగులోకొచ్చిన అనంతరం ఇది కూడా బయటపడిందన్నారు. రమేష్ శర్మతో పాటు ముగ్గురు డైరెక్టర్లు వినరుకుమార్ శర్మ, రంగనాథన్ శ్రీనివాసన్, అశ్వని కుమార్ లపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!