41 మంది మహిళల్ని హైర్ చేసుకున్న మక్కా హోటల్
- March 21, 2018
మక్కా: మక్కాలోని ఓ ప్రముఖ హోటల్ 41 మంది సౌదీ మహిళల్ని రిసెప్షన్, బుకింగ్స్, అడ్మినిస్ట్రేషన్, కిచెన్ విభాగాలకుగాను హైర్ చేసుకుంది. అబీర్ అల్ హర్బి అనే మహిళ మాట్లాడుతూ, తాను ఫుడ్ ప్రిపరేషన్ విభాగంలో అవకాశం దక్కించుకున్నాననీ, ఈ పని తనకు చాలా ఆనందాన్నిస్తోందని చెప్పింది. రిసెప్షనిస్ట్ సారా నజ్జర్ మాట్లాడుతూ, వర్క్ ప్లేస్ చాలా బాగుందనీ, చాలా నేర్చుకుంటున్నాననీ చెప్పింది. వివిధ దేశాలకు చెందినవారు హోటల్‌కి వస్తుంటారనీ, వారితో మాట్లాడటం వల్ల ఆయా భాషల్ని తెలుసుకోగలుగుతున్నానని ఆమె వివరించింది. మరో రిసెప్షనిస్ట్ రీమ బకత్యాన్ మాట్లాడుతూ, కొత్త బాధ్యతలు తనలో ఆత్మవిశ్వాసం పెంచినట్లు పేర్కొంది. కాల్ సెంటర్ ఎంప్లాయీ అరా బుకారి మాట్లాడుతూ, హోటల్ లోని గెస్ట్‌ల నుంచి రెగ్యులర్‌గా వచ్చే ఫోన్ కాల్స్‌ని రివీస్ చేసుకుని, వారికి తగిన సమాచారం అందిస్తున్నట్లు చెప్పింది. మెడికల్ ఇన్సూరెన్స్ కోఆర్డినేర్ అఫాఫ్ అబ్దుల్లా మాట్లాడుతూ జీవితంల ఉన్నత శిఖరాల్ని అధిరోహించేందుకు ఇదొక అరుదైన అవకాశమని వెల్లడించింది. జనరల మేనేజర్ ఫవాన బయోమి మాట్లాడుతూ మహిళా అభ్యర్థులకు అన్ని డిపార్ట్‌మెంట్స్‌లో ఉద్యోగావకాశాలు ఎదురుచూస్తున్నాయని చెప్పారు.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!