ప్రయాణీకుడికి 18,000 దిర్హామ్‌లు తిరిగిచ్చిన దుబాయ్‌ ఎయిర్‌పోర్ట్‌ స్టాఫ్‌

- March 22, 2018 , by Maagulf
ప్రయాణీకుడికి 18,000 దిర్హామ్‌లు తిరిగిచ్చిన దుబాయ్‌ ఎయిర్‌పోర్ట్‌ స్టాఫ్‌

దుబాయ్‌:స్వదేశానికి వెళుతున్న ఓ ప్రయాణీకుడు 18,000 దిర్హామ్‌లను పోగట్టుకోగా, అతనికి ఆ మొత్తాన్ని ఎయిర్‌పోర్ట్‌ స్టాఫ్‌ అప్పగించారు. విషయంలోకి వెళితే, యూఏఈ నివాసితుడు, 5,000 డాలర్లు (18,364 దిర్హామ్‌లు) లోన్‌గా తీసుకుని, స్వదేశానికి వెళ్ళాడు. అయితే విమానం దిగాక, తాను తనతోపాటు తెచ్చుకున్న మొత్తాన్ని పోగొట్టుకున్నట్లు గుర్తించాడు. కాగా, పోయిన డబ్బుని తాము గుర్తించామంటూ దుబాయ్‌ ఎయిర్‌పోర్ట్‌ స్టాఫ్‌, బాధితుడికి తెలిపారు. పెళ్ళి కోసం సేకరించుకున్న ఆ మొత్తం పోగొట్టుకున్నట్లు తొలుత భావించిన నిందితుడు, అనూహ్యంగా ఆ మొత్తం తిరిగి తన వద్దకు చేరడం పట్ల అమితానందాన్ని వ్యక్తం చేశాడు. ప్రయాణంలో ఒక్కోసారి ఒత్తిడికి గురయ్యే ప్రయాణీకులు తమకి చెందిన వస్తువులు, డబ్బు పోగొట్టుకోవడం జరుగుతుంటుందనీ, అలాంటి సమయాల్లో వారికి అండగా వుంటామని ఎయిర్‌పోర్ట్‌ సెక్యూరిటీ డైరెక్టర్‌ జనరల్‌ బ్రిగేడియర్‌ అలి బిన్‌ లాహెజ్‌ చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com