గడువు తీరిన కేక్ అమ్మకం: ముగ్గురి అరెస్ట్
- March 22, 2018
మస్కట్: ఇజ్కి లోని ఓ స్కూల్‌లో విద్యార్థులకు గడువు తీరిన కేక్‌లను విక్రయించినందుకుగాను ముగ్గుర్ని అరెస్ట్ చేసినట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ కన్స్యుమర్ ప్రొటెక్షన్ వెల్లడించింది. ఇందులో ఇద్దరికి 2,000 ఒమన్ రియాల్స్ జరీమానా విధించగా, మరో వ్యక్తికి 200 ఒమన్ రియాల్స్ జరీమానా విధించారు. కన్స్యుమర్ ప్రొటెక్షన్ చట్టాన్ని ఉల్లంఘించినట్లుగా వీరిపై అభియోగాలు మోపబడ్డాయి. విక్రయించిన కేకులపై లేబుల్స్‌ని టాంపరింగ్ చేయడం, గడువు తీరిన కేక్‌లను విక్రయించడం ద్వారా నిందితులు చట్టాన్ని ఉల్లంఘించి, నేరానికి పాల్పడినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇజ్కి స్కూల్ నుంచి అందిన ఫిర్యాదు మేరకు ఈ చర్యలు తీసుకున్నారు. క్యాంటీన్‌లో అమ్మకందారులు, 'గడువు' పేర్కొనకపోవడం, కొన్ని కేక్‌లపై స్టిక్కర్స్ లేకుండా, 'గడువు' ట్యాంపరింగ్ చేయడం వంటి ఉల్లంఘనలకు పాల్పడుతున్నట్లు అధికారులకు ఇజ్కి స్కూల్ ఫిర్యాదు చేసింది.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







