టాలీవుడ్ నిర్మాత సంగిశెట్టి దశరథ కన్నుమూత..
- March 22, 2018
సినీ నిర్మాత సంగిశెట్టి దశరథ అనారోగ్యంతో గురువారం ఉదయం హైదరాబాద్‌లో కన్నుమూశారు. ఆయనకు 65 ఏళ్లు. హైదరాబాద్ లోని బోయిన్‌పల్లిలో ఆయన నివాసం ఉంటున్నారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన డయాలసిస్ కూడా చేయించుకుంటున్నారు. దాదాపు ముఫై ఏళ్లకు పైగా ఆయన తెలుగు సినీరంగంలో ఉంటూ పలు సినిమాలను స్నేహితులతో కలిసి నిర్మించారు. ఇంద్రధనుస్సు, ఆత్మబంధం, టార్గెట్ వంటి పలు సినిమాలు ఆయన తీసిన వాటిలో ఉన్నాయి. తాజాగా విశ్వప్రసాద్ దర్శకత్వంలో నిర్మించిన భార్య చిత్రం విడుదల కావాల్సివుంది. చిన్న చిత్రాల నిర్మాతలకు ఎదరవుతున్న కష్టనష్టాలపై ఆయన ఎన్నోసార్లు స్పందించారు. సినీరంగంలోని అనేక సమస్యలపై జరిగిన పోరాటాల్లో కూడా ఆయన పాల్గొన్నారు. చిన్న సినిమాల విడుదలలో నెలకొన్న థియేటర్ల సమస్యపై తెలుగు చలనచిత్ర పరిరక్షణ సమితి తరపున జరిగిన ఆందోళన కార్యక్రమాల్లో కూడా ఆయన చురుకుగా పాల్గొన్నారు. దశరథ మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తంచేస్తూ, వారి కుటుంబానికి తమ సానుభూతిని తెలియజేశారు.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!