'102 నాటౌట్‌' మూవీ ఫన్నీ పోస్టర్

- March 23, 2018 , by Maagulf
'102 నాటౌట్‌' మూవీ ఫన్నీ పోస్టర్

27 ఏళ్ళ తర్వాత బాలీవుడ్ స్టార్ హీరోస్ అమితాబ్ బచ్చన్‌, రిషీ కపూర్ కలిసి నటిస్తున్న చిత్రం 102 నాటౌట్‌. మే 4న విడుదల కానున్న ఈ చిత్ర టీజర్ ఇటీవల విడుదల అయింది. దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. 102 ఏళ్ళ తండ్రి పాత్రలో అమితాబ్‌, 72 ఏళ్ళ కొడుకు పాత్రలో రిషి కపూర్ అద్భుతంగా నటించారు. ఉమేష్ శుక్లా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం గుజరాతీ డ్రామా `సౌమ్య జోషి` రచించిన నాటకం స్ఫూర్తితో రూపొందుతున్నట్టు తెలుస్తుంది. ట్రిటాప్ ఎంటర్‌టైన్‌మెంట్‌- బెంచ్ మార్క్ పిక్చర్స్ సంయుక్తంగా ఈ క్రేజీ మూవీని నిర్మిస్తున్నాయి. 'పా' చిత్రంలో ప్రొగేరియా వ్యాధితో బాధపడే 12 సంవత్సరాలు పిల్లవాడిగా నటించిన అమితాబ్‌కు ఇది మరో ఛాలెంజింగ్‌ రోల్‌ అనీ, అలాగే ఇప్పటివరకూ ఎన్నడూ చేయని కేరక్టర్‌ను రిషి చేస్తున్నారనీ యూనిట్‌ వర్గాలు అంటున్నాయి. గతంలో ఈ ఇద్దరు కలిసి 'అమర్‌ అక్బర్‌ ఆంథోనీ', 'నసీబ్‌', 'కభీ కభీ', 'కూలీ' తదితర విజయవంతమైన చిత్రాల్లో కలిసి నటించారు. తాజాగా చిత్రానికి సంబంధించిన ఫన్నీ పోస్టర్ విడుదల చేశారు మేకర్స్‌. గుడ్డులో నుండి రిషీ కపూర్ బయటకి వస్తున్నట్టు పోస్టర్ లో కనిపిస్తుండగా, బాప్ కూల్‌.. బేటా ఓల్డ్ కూల్ అనే క్యాప్షన్‌తో పోస్టర్ అభిమానులలో ఆనందాన్ని కలిగిస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com