సౌదీ అరేబియా మీదుగా ఇజ్రాయెల్‌కు చేరిన..ఎయిరిండియా విమాన యాన సంస్థ

- March 23, 2018 , by Maagulf
సౌదీ అరేబియా మీదుగా ఇజ్రాయెల్‌కు చేరిన..ఎయిరిండియా విమాన యాన సంస్థ

టెల్‌ అవివ్‌: సౌదీ అరేబియా గగనతలం మీదేగా ఇజ్రాయెల్‌కు వెళ్లి భారత విమానయాన సంస్థ ఎయిరిండియా చరిత్ర సృష్టించింది. ఢిల్లీ నుంచి బయలుదేరిన ఎయిరిండియా విమానం శుక్రవారం ఇజ్రాయెల్‌లోని టెల్‌ అవివ్‌కు చేరుకున్నట్లు ఇజ్రాయెల్‌ పర్యాటక మంత్రి యారివ్‌లెవిన్‌ తెలిపారు. సౌదీ అరేబియా ఇజ్రాయెల్‌ వెళ్లే విమానాలను వారి గగనతలం నుంచి వెళ్లేందుకు ఎయిరిండియాకు ఆ అనుమతి ఇవ్వడంతో నేరుగా సౌదీ మీదుగా ఢిల్లీ నుంచి టెల్‌ అవివ్‌లోని బెన్‌ గురియాన్‌ విమానాశ్రయానికి విమానం చేరుకుంది. 'ఇది నిజంగా చారిత్రక ఘటనని, తాము కొత్త తరంలో ఉన్నామని, మరింత మంది భారతీయ పర్యాటకులు ఇజ్రాయెల్‌కు రావాలని, అలాగే ఇజ్రాయెల్‌ వాసులు భారత్‌కు అధిక సంఖ్యలో వెళ్లాలని ఆశిస్తున్నట్లు ఇజ్రాయెల్‌ పర్యాటక మంత్రి యారివ్‌ లెవిన్‌ వెల్లడించారు. ఈ మార్పు ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతానికి సహకరిస్తుందని పేర్కొన్నారు. సౌదీ అరేబియా ఎయిరిండియాకు తమ గగనతలం మీదుగా ఇజ్రాయెల్‌ వెళ్లేందుకు అనుమతి ఇవ్వడంతో ప్రయాణ సమయం, ఇంధన ఖర్చు బాగా తగ్గింది. దాదాపు రెండు గంటలు అదనపు ప్రయాణం తగ్గింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com