విశాఖలో కుప్పకూలిన షాపింగ్ మాల్ బిల్డింగ్..
- March 23, 2018
విశాఖ జిల్లాలో నిర్మాణంలో ఉన్న షాపింగ్ మాల్ బిల్డింగ్ కుప్పకూలింది.. గాజువాకలోని సీఎంఆర్ షాపింగ్ మాల్ కు చెందిన బిల్డింగ్ శ్లాబ్ వర్క్ నిర్వహిస్తుండగా ఐరన్ జాకీలు తప్పిపోయాయి. దీంతో పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలింది.. ప్రమాదంలో కార్మికులకు తీవ్రగాయాలయ్యాయి. ఇద్దరికి చేతులు కాళ్లు విరిగాయి. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. అప్రమత్తమైన స్థానికులు వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. ఎలాంటి ముందస్తు భద్రతా చర్యలు తీసుకోకుండా పనులు చేస్తుండటం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అలాగే భద్రతకు సంబంధించిన ఎలాంటి పరికరాలు కార్మికుల దగ్గర లేవు. ప్రమాదంలో ఎనిమిది మంది కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే సీఎంఆర్కు సంబంధించిన బోర్డులు తొలగించింది యాజమాన్యం.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







