వలసలపై ఆసియా సదస్సులో పాల్గొన్న డా. త్రిలోక్
- March 23, 2018
హైదరాబాద్:'ప్రపంచ వలసల సమగ్ర విధాన ప్రక్రియ' (గ్లోబల్ కాంపాక్ట్ ఫర్ మైగ్రేషన్) అనే అంశంపై ఐక్యరాజ్య సమితి వారు రూపొందించిన తుది ముసాయిదాపై చర్చిండానికి ఈనెల 21 నుండి 23 వరకు నేపాల్ దేశ రాజధాని ఖాట్మండు లో జరిగిన ఆసియా ప్రాంతీయ సదస్సుకు తెలంగాణ ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరమ్ (తెలంగాణ ప్రవాసి సంక్షేమ వేదిక) పక్షాన డా. కలాలి త్రిలోక్ చందన్ గౌడ్ హాజరయ్యారు. భారతీయ వలస కార్మికులు, కార్మిక సంఘాలు, సామాజిక సంస్థల అభిప్రాయాలను డా. త్రిలోక్ మూడు రోజుల సదస్సులో వివరించారు. వలసకార్మికుల హక్కుల రక్షణ, సంక్షేమం గురించి అన్ని ప్రభుత్వాలు కృషిచేయాలని ఆయన కోరారు.
ప్రవాస భారతీయ కార్మికుల స్థితిగతుల గురించి పరిశోధన చేసిన త్రిలోక్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుండి డాక్టరేట్ పొందారు. సంగారెడ్డి జిల్లాకు చెందిన డా. త్రిలోక్ తెలంగాణ ప్రవాసి సంక్షేమ వేదిక సంస్థలో ప్రవాస భారతీయుల విభాగం కోఆర్డినేటర్ గా సేవలందిస్తున్నారు. డా. త్రిలోక్ ను అతని మొబైల్ & వాట్సప్ +91 94934 60031 ఇ-మెయిల్: [email protected] ద్వారా సంప్రదించవచ్చు.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!