ఎవెన్యూస్ మాల్ 4 వ దశ ప్రారంభంకు హాజరవనున్న ప్రధాన మంత్రి
- March 23, 2018
కువైట్: ప్రధాన మంత్రి శ్రీ షేక్ జబెర్ అల్ ముబారక్ అల్-హమాద్ అల్ సబహ్ గురువారం అవెన్యూస్ మాల్ లో నాలుగో దశ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ఉప ప్రధాన మంత్రి, అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్ ఖలీద్ అల్ జర్ర అల్ సబా, డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ మరియు క్యాబినెట్ వ్యవహారాల సహాయ మంత్రి అనాస్ అల్ సలీ, అమిరి దివాన్ వ్యవహారాల ప్రతినిధి షేక్ మహ్మద్ అల్-అబ్దుల్లా అల్ ముబారక్ అల్ సబాహ్, షేక్ లు, మంత్రులు, సీనియర్ రాష్ట్ర అధికారులు. హాజరయినట్లు ఒక పత్రిక ప్రకటనలో పేర్కొన్నారు.గౌరవనీయ ప్రధానమంత్రి షేక్ జబెర్ అల్ ముబారక్ అవెన్యూస్లో నూతన అభివృద్ధిని ప్రశంసించారు, స్థానిక మరియు అంతర్జాతీయంగా ఈ ప్రాజెక్ట్ కువైట్ కు ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు. దేశం యొక్క అభివృద్ధి ప్రణాళిక పెంచడంతో పాటు విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో ప్రైవేటు రంగం అమలు చేసే ఈ తరహా ప్రాజెక్టుల ప్రాముఖ్యతను ఆయన ఈ సందర్భంగా వివరించారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







