ట్యునీషియా: ముస్లిం పార్టీ అభ్యర్థిగా యూదు జాతీయుడు

- March 23, 2018 , by Maagulf
ట్యునీషియా: ముస్లిం పార్టీ అభ్యర్థిగా యూదు జాతీయుడు

ట్యునిస్‌ : ట్యునీషియా నగరమైన మోనాస్టిర్‌లో సిమన్‌ స్లామా, ఆయన కుటుంబం మాత్రమే యూదులు. ఒకప్పుడు పెద్ద సంఖ్యలో వుండే యూదులు తదనంతర కాలంలో అక్కడ నుండి వలసలు వెళ్ళిపోయారు. వారితోపాటు వెళ్ళకుండా వుండిపోయిన సిమన్‌ స్లామా ట్యునీషియా ఇస్లామిస్ట్‌ పార్టీ ఎన్నదా అభ్యర్థిగా పోటీ చేశారు. మేలో జరుగుతున్న మున్సిపల్‌ ఎన్నికల్లో ఎన్నదా పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసిన స్లామా ముస్లింలు అధికంగా వుండే ఈ దేశంలో సంచలనం కలిగించారు. కొంత వివాదాన్ని కూడా రగిల్చారు. అమెరికా వంటి పశ్చిమ దేశాల్లో తన పేరు ప్రతిష్టలు తిరిగి సంపాదించుకునేందుకు ఎన్నడా చాలా పకడ్బందీగా వేసిన ఎత్తుగడగా ఈ చర్యను విమర్శకులు చూస్తున్నారు. కాగా, దీర్ఘకాల సాంప్రదాయంగా వస్తున్న సంయమనాన్ని పాటిస్తున్నారనడానికి ఇదొక ఉదాహరణ అని కొందరు పేర్కొంటున్నారు. దేశానికి సేవ చేయాలన్నదే తన అభిమతమని కుట్టుమిషన్లు విక్రయించే, రిపేరు చేసే స్లామా పేర్కొన్నారు. ఇస్లామిక్‌, యూదు మతాలకు మధ్య పెద్ద తేడా లేదని అందుకే తానీ పార్టీని ఎంపిక చేసుకున్నా అని చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com