సౌదీ జెట్ఫైటర్ను పేల్చేశామని..యెమెన్ ప్రకటన
- March 23, 2018_1521811054.jpg)
సౌదీఅరేబియా : సౌదీ జెట్ ఫైటర్ ఎఫ్15ను గగనతలంలోనే పేల్చేశామని యెమెన్ ప్రకటించింది. అల్ మశీరా అనే యెమెన్ టీ.వీ చానెల్ ఓ వీడియో ప్రసారం చేసింది. ఆ వీడియోలో యెమెన్ దళాలు సౌదీ జెట్‌ఫైటర్ ఎఫ్15ను పేల్చేస్తున్నారు. ఉపరితలం నుంచి గాలిలోని వస్తువులను క్షిపణి నుపయోగించి జెట్ఫైటర్ను పేల్చేసినట్లు యెమెన్ మరో వైపున చెబుతోంది. అయితే సౌదీ అధికారులు మాత్రం అలాంటి ప్రమాదం జరగలేదంటున్నారు. యెమెన్ దళాల వద్ద అంతటి ఆధునిక ఆయుధాలు లేవని వారు చెబుతున్నారు. అసలు ఎఫ్15 జెట్ఫైటర్కు ఏమి జరగలేదని సురక్షితంగానే ఉందని వారు అన్నారు. యెమెన్ దళాలు తమ ఆత్మస్థైర్యాన్ని దెబ్బకొట్టేందుకు ఇలాంటి పుకార్లు వ్యాప్తి చేస్తుందని సౌదీ రక్షణశాఖ అధికారులు ఆరోపించారు. ఇరాన్ పంపుతున్న ఆయుధాలతోనే యెమెన్ దళాలు తమపై దాడులకు తెగబడుతున్నాయని సౌదీ అధికారులు అన్నారు. యెమెన్ విడుదల చేసిన వీడియో వాస్తవం కాదని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ఆ వీడియోను 16 వేల మంది చూశారని వారు చెప్పారు.
తాజా వార్తలు
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!