ఫేక్ పేపర్స్‌తో అద్దెకు కారు: ఇద్దరిపై కేసు
- March 23, 2018
దుబాయ్:అద్దెకు కారు తీసుకుని, తిరిగి ఆ కారుని ఇవ్వనందుకుగాను, అలాగే రెంటల్ ఫీజ్ చెల్లించనందుకుగాను వారిపై కేసులు నమోదయ్యాయి. పాకిస్తాన్‌కి చెందిన ఇద్దరు వ్యక్తులు ఫోర్జరీ డాక్యుమెంట్ల ద్వారా అల్ రషిదియాలోని ఓ ఆఫీసు ద్వారా కార్లను అద్దెకి తీసుకున్నారు. అయితే అద్దె చెల్లించడంలో ఇద్దరూ తప్పించుకు తిరుగుతున్నట్లు పోలీసులకు అందిన ఫిర్యాదు మేరకు విచారణ జరిగింది. అయితే నిందితులు, నేరాన్ని తొలుత అంగీకరించలేదు. ఫోర్జరీ డాక్యుమెంట్లకు సంబంధించిన ఆరోపణల్నీ నిందితులు ఒప్పుకోవడంలేదు. ఎమిరేటీ ఐడీ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ ఇలా అన్నీ ఫేక్ అని విచారణలో తేలింది. బాధితుడు, తనకు నిందితులు ఇచ్చిన డాక్యుమెంట్ల ప్రకారం సదరు వ్యక్తిని సంప్రదిస్తే, ఆ వ్యక్తి ఆ డాక్యుమెంట్లతో తనకు సంబంధం లేదని చెప్పారనీ న్యాయస్థానం యెదుట వాపోయాడు. ఈ కేసులో మార్చి 26న తీర్పు వెలువడనుంది.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







