అమెరికాలో 'నా పేరు సూర్య' ఆటా పాట..

- March 23, 2018 , by Maagulf
అమెరికాలో 'నా పేరు సూర్య' ఆటా పాట..

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న నా పేరు సూర్య (నా ఇల్లు ఇండియా) చిత్రం కోసం ఓ రొమాంటిక్‌ పాటను అమెరికాలో చిత్రీకరిస్తున్నారు. అల్లు అర్జున్‌తో పాటు కథానాయిక అను ఇమ్మాన్యుయేల్‌ పై ఈ పాటను తీస్తున్నారు. వక్కంతం వంశీ దర్శకత్వంలో కె.నాగబాబు సమర్పణలో రామలక్ష్మి సినీ క్రియేషన్స్‌ పతాకంపై శిరీష శ్రీధర్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ప్రస్తుతం అమెరికాలో చిత్రీకరిస్తున్న పాట పూర్తికాగానే చిత్రబృందం తిరిగి హైదరాబాద్‌ చేరుకుని ఓ ప్రత్యేక పాటను తీయనుంది. ఈ పాటను అల్లు అర్జున్‌, బాలీవుడ్‌ భామ ఎలీ అవరమ్‌పై చిత్రీకరించనున్నట్లు సమాచారం. సందేశంతో కూడుకున్న చక్కటి సాహిత్యంతో ఈ పాట ఉంటుందని అంటున్నారు. అల్లు అర్జున్‌ ఆర్మీ సోల్జర్‌ (సైనికుడు)గా తన అద్వితీయమైన నటనను ఈ చిత్రంలో ప్రదర్శించారని, ఆయనపై తీసిన ఇంట్రడక్షన్‌ సాంగ్‌ చిత్రానికి ఓ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని నిర్మాత లగడపాటి శ్రీధర్‌ వెల్లడించారు. ఏప్రిల్‌లో ఈ చిత్రం ఆడియో వేడుకను నిర్వహించి, మే 4న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. బాలీవుడ్‌ సంగీత ద్వయం విశాల్‌, శేఖర్‌ సంగీతాన్ని సమకూరుస్తున్న ఈ చిత్రంలోని ఇతర ముఖ్యపాత్రల్లో యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌, శరత్‌కుమార్‌ తదితరులు నటిస్తుండగా, సినిమాటోగ్రఫీని రాజీవ్‌ రవి, ఎడిటింగ్‌ను కోటగిరి వెంకటేశ్వరరావును అందిస్తున్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: బన్ని వాసు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com