నకిలీ పాస్‌పోర్టుతో దుబాయ్ వెళ్లేందుకు యత్నించిన కోలీవుడ్ నటి అరెస్ట్

- March 24, 2018 , by Maagulf
నకిలీ పాస్‌పోర్టుతో దుబాయ్ వెళ్లేందుకు యత్నించిన కోలీవుడ్ నటి అరెస్ట్

చెన్నై:నకిలీ పాస్‌పోర్టు వ్యవహారంలో ఓ కోలీవుడ్ సహాయ నటి అరెస్టైంది. సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ ఆఫ్ గ్రేటర్ చెన్నై తనిఖీల్లో నకిలీ పాస్‌పోర్టుతో దుబాయ్ వెళ్లేందుకు ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయింది. ఆమెను చెన్నైలోని సాలీగ్రామ్‌లో నివసించే కోలీవుడ్ సహాయనటి మమతగా పోలీసులు గుర్తించారు. ఆమె దుబాయ్‌లో కల్చరల్ ప్రోగ్రాంకు హాజరయ్యేందుకు దుబాయ్ వెళుతోంది.

ఈ నెల 20న ఫ్లైట్‌లో దుబాయ్ వెళ్లేందుకు మమత చెన్నైలోని ఇంటర్నేషనల్ టెర్మినల్ ఎయిర్‌పోర్టుకు వెళ్లింది. ఇమిగ్రేషన్ అధికారులు ఆమె పాస్‌పోర్టును తనిఖీ చేయగా అది ఫేక్ డాక్యుమెంట్స్‌తో తీసుకున్నదిగా తేలింది. దీంతో మమతను అధికారులు ఫ్లైట్ ఎక్కనివ్వలేదు. సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్‌తో కలిసి ఇమిగ్రేషన్ అధికారులు మమతపై కేస్ ఫైల్ చేశారు. గురువారం ఆమెను అరెస్ట్ చేశారు. పోలీసుల ఎంక్వైరీలో మమత స్వస్థలం కర్ణాటకలోని కోలార్‌గా తేలింది. ఆమె తమిళ్ ఫిలిం ఇండస్ట్రీలో అవకాశాల కోసం చెన్నైకి షిఫ్ట్ అయినట్టు తేలింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com