ఇండియా:టీవీ ప్యానెల్స్‌పై దిగుమతి సుంకం తగ్గింపు

- March 24, 2018 , by Maagulf
ఇండియా:టీవీ ప్యానెల్స్‌పై దిగుమతి సుంకం తగ్గింపు

దిల్లీ: దేశంలో తయారీ రంగాన్ని అభివృద్ధి చేయడం కోసం ప్రభుత్వం భారత్‌కు దిగుమతి అయ్యే టీవీ ప్యానెల్స్‌పై సుంకాన్ని తగ్గించింది. ఈ మేరకు శనివారం సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్ ఎక్సైజ్‌ అండ్‌ కస్టమ్స్‌(సీబీఈసీ) అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఓపెన్‌ సెల్‌(15.6'' అంగుశాలు, అంతకంటే ఎక్కువ) ఎల్‌ఈడీ, ఎల్‌సీడీ టెలివిజన్స్‌లో ఉపయోగించే ప్యానెల్స్‌పై దిగుమతి సుంకాన్ని 5శాతానికి చేసినట్లు సీబీఈసీ వెల్లడించింది. దిగుమతి సుంకాన్ని తగ్గించడం వల్ల దేశంలో తయారయ్యే ఎల్‌ఈడీ, ఎల్‌సీడీ టీవీల విభాగాన్ని ఎంతో ప్రోత్సహించినట్లవుతోందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక నుంచి ఆయా విడిభాగాలపై 5శాతం మేర మాత్రమే సుంకాన్ని వసూలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

గత నెల ఒకటో తేదీన కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఎల్‌సీడీ, ఎల్‌ఈడీ టీవీ ప్యానెల్స్‌పై విధిస్తున్న దిగుమతి సుంకాన్ని రెట్టింపు చేసిన విషయం తెలిసిందే. గతంలో 7.5శాతంగా ఉన్న కస్టమ్స్‌ డ్యూటీని ప్రభుత్వం 15శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇప్పుడు ఆ సుంకాన్ని5శాతంకు చేర్చింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com