నయనతారకు 'ది హిందూ ఎక్స్ లెన్స్' అవార్డు..
- March 24, 2018
'ది హిందూ' ఆంగ్ల దినపత్రిక 'వరల్డ్ ఆఫ్ ఉమెన్-2018' అవార్డులలో భాగంగా సినీరంగంలో అత్యుత్తమ నటనను కనబరుస్తున్న దక్షిణాది లేడి సూపర్ స్టార్ నయనతారను ఎక్స్ లెన్స్ అవార్డుతో సత్కరించింది.. చెన్నై లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆమెకు ఈ అవార్డును ప్రదానం చేశారు.. ఈ సందర్భంగా నయన్ మాట్లాడుతూ, ..తన తల్లిదండ్రులకు, సోదరుడికి కృతజ్ఞతలు తెలిపింది. అంతేకాక తనకు కాబోయే భర్త విఘ్నేశ్ని ప్రస్తావిస్తూ అతడికి కూడా కృతజ్ఞతలు తెలిపింది. తొలిసారిగా నయన్ తనకు కాబోయే భర్త అంటూ ప్రకటించింది.. ఈ ఇద్దరూ గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు.. వారి వివాహం ఈ ఏడాది చివరిలో జరగనుందని టాక్.. ప్రస్తుతం నయనతార తెలుగులో సైరాలో నటిస్తుండగా, తమిళంలో అరడజన్ కు పైగా చిత్రాలు చేతిలో ఉన్నాయి.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







