నయనతారకు 'ది హిందూ ఎక్స్ లెన్స్' అవార్డు..

- March 24, 2018 , by Maagulf
నయనతారకు 'ది హిందూ ఎక్స్ లెన్స్' అవార్డు..

'ది హిందూ' ఆంగ్ల దినపత్రిక 'వరల్డ్ ఆఫ్ ఉమెన్-2018' అవార్డులలో భాగంగా సినీరంగంలో అత్యుత్తమ నటనను కనబరుస్తున్న దక్షిణాది లేడి సూపర్ స్టార్ నయనతారను ఎక్స్ లెన్స్ అవార్డుతో సత్కరించింది.. చెన్నై లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆమెకు ఈ అవార్డును ప్రదానం చేశారు.. ఈ సందర్భంగా నయన్ మాట్లాడుతూ, ..తన తల్లిదండ్రులకు, సోదరుడికి కృతజ్ఞతలు తెలిపింది. అంతేకాక తనకు కాబోయే భర్త విఘ్నేశ్‌ని ప్రస్తావిస్తూ అతడికి కూడా కృతజ్ఞతలు తెలిపింది. తొలిసారిగా నయన్ తనకు కాబోయే భర్త అంటూ ప్రకటించింది.. ఈ ఇద్దరూ గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు.. వారి వివాహం ఈ ఏడాది చివరిలో జరగనుందని టాక్.. ప్రస్తుతం నయనతార తెలుగులో సైరాలో నటిస్తుండగా, తమిళంలో అరడజన్ కు పైగా చిత్రాలు చేతిలో ఉన్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com