చాక్లెట్ ఖరీదు రూ.6లక్షలా..
- March 24, 2018
చాక్లెట్.. ఆ పేరు వింటేనే నోరు ఊరిపోతుంది కదూ. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడే ఈ చాక్లెట్లు చాలా ప్లేవర్లలో వస్తుంటాయి. ఖరీదు కూడా ఎంత ఎక్కువ పెట్టినా రూ 5000 ల వరకు ఉండొచ్చు. కానీ పోర్చుగల్ లోని ఒబిడాన్ లో ఇంటర్నేషనల్ చాక్లెట్ ఫెస్టివల్ జరిగింది. అక్కడ ప్రదర్శనకు ఉంచిన చాక్లెట్లలో ఒకటి అందరి దృష్టిని ఆకర్షించింది. 'బాన్ బాన్' అనే ఈ చాక్లెట్ రూ.6లక్షల రూపాయల ధర పలుకుతూ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చాక్లెట్గా నిలిచింది. ఈ చాక్లెట్ని తయారు చేయడానికి సంవత్సర కాలం పట్టిందని దీన్ని తయారు చేసిన డేనియల్ గోమెస్ తెలియజేసారు. మరి ఈ స్పెషల్ చాక్లెట్ ఇంద ధర పలకడానికి కారణం తయారీకి ఉపయోగించిన పదార్థాలు స్వరోవ్ స్కీ క్రిస్టల్స్, ఖరీదైన ముత్యాలు. మిగిలినది అంతా చాక్లెట్లో వాడే పదార్థాలనే ఉపయోగించారు. పైన మాత్రం గోల్డ్ రిబ్బన్తో ఈ బుల్లి చాక్లెట్ని చుట్టేసారు. షో చూడ్డానికి వచ్చిన వారు చాక్లెట్ ఊరిస్తున్నా కొనలేకపోయారు.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!