చాక్లెట్ ఖరీదు రూ.6లక్షలా..

- March 24, 2018 , by Maagulf
చాక్లెట్ ఖరీదు రూ.6లక్షలా..

చాక్లెట్.. ఆ పేరు వింటేనే నోరు ఊరిపోతుంది కదూ. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడే ఈ చాక్లెట్లు చాలా ప్లేవర్లలో వస్తుంటాయి. ఖరీదు కూడా ఎంత ఎక్కువ పెట్టినా రూ 5000 ల వరకు ఉండొచ్చు. కానీ పోర్చుగల్ లోని ఒబిడాన్‌ లో ఇంటర్నేషనల్ చాక్లెట్ ఫెస్టివల్ జరిగింది. అక్కడ ప్రదర్శనకు ఉంచిన చాక్లెట్లలో ఒకటి అందరి దృష్టిని ఆకర్షించింది. 'బాన్ బాన్' అనే ఈ చాక్లెట్ రూ.6లక్షల రూపాయల ధర పలుకుతూ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చాక్లెట్‌గా నిలిచింది. ఈ చాక్లెట్‌ని తయారు చేయడానికి సంవత్సర కాలం పట్టిందని దీన్ని తయారు చేసిన డేనియల్ గోమెస్ తెలియజేసారు. మరి ఈ స్పెషల్ చాక్లెట్ ఇంద ధర పలకడానికి కారణం తయారీకి ఉపయోగించిన పదార్థాలు స్వరోవ్ స్కీ క్రిస్టల్స్, ఖరీదైన ముత్యాలు. మిగిలినది అంతా చాక్లెట్‌లో వాడే పదార్థాలనే ఉపయోగించారు. పైన మాత్రం గోల్డ్ రిబ్బన్‌తో ఈ బుల్లి చాక్లెట్‌ని చుట్టేసారు. షో చూడ్డానికి వచ్చిన వారు చాక్లెట్ ఊరిస్తున్నా కొనలేకపోయారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com