కేంబ్రిడ్జ్ ఎనలిటికాలో బ్రిటన్ అధికారుల సోదాలు
- March 24, 2018
లండన్: సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్ నుంచి సమాచార చౌర్యానికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంబ్రిడ్జ్ ఎనలిటికా కార్యాలయాలలో బ్రిటన్ అధికారులు సోదాలు నిర్వహించారు. శుక్రవారం రాత్రి మొదలైన సోదాలు శనివారం ఉదయం వరకు కొనసాగాయని సమాచార కమిషనర్ కార్యాలయం తెలిపింది. తమకు లభించిన సమాచారాన్ని పరిశీలించిన తరువాత తదుపరి చర్యలు తీసుకుంటామన్నది. జడ్జి నుంచి అనుమతి పొందిన తరువాత తమ ఏజెంట్లు 18 మంది స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 8 గంటలకు ఎనలిటికా కార్యాలయంలో ప్రవేశించారని, తిరిగి శనివారం తెల్లవారు జామున 3 గంటలకు బయటకు వచ్చారని ఓ ప్రభుత్వ ప్రతినిధి చెప్పారు. భారత ప్రభుత్వం సైతం కేంబ్రిడ్జ్ ఎనలిటికా సంస్థకు నోటీసులు జారీ చేసింది.
తాజా వార్తలు
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు







