భారత మహిళల ప్రపంచ రికార్డు!
- March 25, 2018
ముంబై : అంతర్జాతీయ టీ20ల్లో భారత మహిళా జట్టు రికార్డు స్కోర్ నమోదు చేసింది. ముక్కోణపు టీ20 సిరీస్‌లో భాగంగా ఆదివారం ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 4 వికెట్లు కోల్పోయి198 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. మహిళల అంతర్జాతీయ టీ20ల్లో ఇది రెండో అత్యధిక స్కోర్‌గా రికార్డుకెక్కింది. 2010లో నెదర్లాండ్స్‌పై దక్షిణాఫ్రికా 205/1 పరుగులతో ఈ జాబితాలో అగ్ర స్థానంలో ఉండగా ఆస్ట్రేలియా(191/3), న్యూజిలాండ్ (188/3), ఇంగ్లండ్ (187/5) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి .
ఈ ఏడాదే గత దక్షిణాఫ్రికా పర్యటనలో 168/3 పరుగుల స్కోరు చేసిన హర్మన్ ప్రీత్ సేన తాజా స్కోర్‌తో అధిగమించింది. ఇక భారత మహిళల బ్యాటింగ్‌లో స్మృతి మంధాన 76( 40 బంతులు, 12 ఫోర్లు, 2 సిక్సర్లు) వేగవంతమైన హాఫ్‌సెంచరీకి తోడు మిథాలీ రాజ్ 53(43 బంతుల్లో 7 ఫోర్లు) రాణించడంతో భారీ స్కోరు నమోదైంది.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..