మెగాస్టార్ నుంచి టైమ్‌లెస్ గిప్ట్ అందుకున్న చెర్రీ

- March 26, 2018 , by Maagulf
మెగాస్టార్ నుంచి టైమ్‌లెస్ గిప్ట్ అందుకున్న చెర్రీ

అలాంటి తండ్రికి పుట్టడమే దేవుడు ఇచ్చిన పెద్ద బహుమానం. మరి ఆ తండ్రి ఏ చిన్న బహుమతి ఇచ్చినా కొడుక్కి అపురూపమైనదే. మెగాస్టార్ చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ ఈ నెల 27న పుట్టినరోజు జరుపుకోనున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని చెర్రీకి వాచ్‌ని బహుకరించారు చిరంజీవి. అమ్మానాన్న ఇచ్చిన బహుమతిని అందుకుంటూ ఫోటోలు దిగారు. ఈ ఫోటోలను అభిమానులకోసం ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు చరణ్. కింద క్యాప్షన్ కూడ జోడించాడు.  టైమ్‌లెస్ గిప్ట్ ఇచ్చిన అమ్మానాన్నకు ధన్యవాదాలు అని తెలిపాడు. మరి అభిమానులు కూడా రంగస్థలం రంగాకి ఒకరోజు ముందుగానే పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com