మీ 'మా-గల్ఫ్‌'కి మూడేళ్ళు

- March 26, 2018 , by Maagulf
మీ 'మా-గల్ఫ్‌'కి మూడేళ్ళు

భారతదేశంలోని తెలుగువారికి, ప్రపంచ వ్యాప్తంగా.. ముఖ్యంగా గల్ఫ్‌ దేశాల్లో వుంటోన్న తెలుగువారికి అనుసంధానకర్తగా వ్యవహరిస్తోన్న 'మా గల్ఫ్‌ డాట్‌ కామ్‌' ఆవిర్భవించి నేటికి మూడేళ్ళు. అతి తక్కువ కాలంలోనే, తెలుగు పాఠకుల మనసుల్ని గెలుచుకున్న 'మా గల్ఫ్‌ డాట్‌ కామ్‌', గల్ఫ్‌ దేశాల్లోని తెలుగువారికి, అక్కడి పరిస్థితుల గురించి అవగాహన కల్పించడంలోనూ, అక్కడ జరుగుతున్న పరిణామాల్ని ఎప్పటికప్పుడు తెలియజేయడంలోనూ ముందుంటోంది. వీసా సమస్యల దగ్గర్నుంచి, ఉద్యోగానికి సంబంధించి వివిధ చట్టాలపై అవగాహన కల్పించేలా పలు అంశాలతో కూడిన కథనాల్ని వెబ్‌సైట్‌ ద్వారా తెలియజేస్తూ, వారందరి మన్ననలూ అందుకోవడం, ఈ క్రమంలో పలువురు ప్రముఖులు మా గల్ఫ్‌ డాట్‌ కామ్‌ని అభినందించడం నిర్వాహకులుగా మాకు ఇదొక అనిర్వచనీయమైన అనుభూతి అని సరగ్వంగా చెప్పగలుగుతాం. ఈ క్రమంలో మమ్మల్ని ప్రోత్సహిస్తున్న ప్రకటన కర్తలకు, తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలకు, గల్ఫ్‌ దేశాల్లోని తెలుగు సంఘాలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. పాఠకుల ముందుకు మరిన్ని విశేషాల్ని ముందు ముందు అందిస్తూ, వారి మనసులకు ఇంకా చేరువయ్యేందుకు ప్రయత్నిస్తామని హామీ ఇస్తున్నాం. మూడేళ్ళుగా మాకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సినిమా విశేషాలు, గల్ఫ్‌ దేశాల్లోని రాజకీయ విశేషాలు, అక్కడి భారతీయులు, ముఖ్యంగా తెలుగువారు సాధిస్తున్న విషయాలు.. ఇవన్నీ ప్రపంచ వ్యాప్తంగా తెలుగువారికి తెలిసేలా 'మా గల్ఫ్‌' ఓ వారధిగా వ్యవహరిస్తోంది. ఇకపై కూడా ఇదే బాధ్యతను ఇంకా సమర్థవంతంగా కొనసాగిస్తామని తెలియజేస్తూ, ఇంకోసారి మూడవ వార్షికోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతాభినందనలు తెలియజేస్తున్నాం. 
- మా గల్ఫ్‌.కామ్‌ 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com