ఫేస్బుక్ లో తప్పులు..ట్విట్టర్ వైపు అడుగులు

- March 26, 2018 , by Maagulf
ఫేస్బుక్ లో తప్పులు..ట్విట్టర్ వైపు అడుగులు

మెక్సికో : ఓటర్ల వ్యక్తిగత వివరాలు కేంబ్రిడ్జ్‌ అనలిటికా అనే సంస్థకు చేరుతున్నాయన్న వార్తలు ప్రకంపనలు సృష్టిస్తున్న తరుణంలో మెక్సికో ఎన్నికల సంఘం ట్వీటర్‌తో ఒప్పందం చేసుకుంది. ఎన్నికల సమాచారాన్ని అధికారికంగా వీలైనంత ఎక్కువమందికి చేరవేసేందుకు ఈ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఆదివారం రెండు సంస్థలు ఒప్పందంపై సంతకాలు చేశాయి.

ఎన్నికలకు సంబంధించిన అన్ని విషయాలను ప్రజలకు తెలిపేందుకు సామాజిక మాధ్యమాలు చాలా బాగా ఉపకరిస్తున్నాయని, అయితే.. తమ ఓటర్ల వ్యక్తిగత సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ సంస్థకు తెలియజేసేది లేదని మెక్సికో ఎన్నికల సంఘం తెలిపింది. ఈ విషయాన్ని ఒప్పందపత్రాల్లో కూడా చేర్చింది. ఫేస్‌బుక్‌, గూగుల్‌తో కూడా ఒప్పందం కుదుర్చుకునే ఆలోచన ఉన్నట్టు ఎన్నికల సంఘం తెలిపింది. అయితే మన దేశంలో ఓటర్ల వ్యక్తిగత సమాచారాన్ని జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీ అమెరికా సంస్థలకు చేరవేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. ఫేస్‌బుక్‌ వినియోగదారుల సమాచారం చోరీకి గురైందని ఒప్పుకుంటూ.. ఈ విషయమై ఆ సంస్థ వ్యవస్థాపకుడు జూకర్‌బర్గ్‌ క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే. భారతీయ జనత పార్టీ అధికారిక నమో యాప్‌ ద్వారా, కాంగ్రెస్‌ అధికారిక యాప్‌ ద్వారా ఓటర్ల వ్యక్తిగత వివరాలు కేంబ్రిడ్జ్‌ అనలిటికా అనే సంస్థకు చేరవేసినట్టు కథనాలు వస్తున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com