షాపింగ్‌ మాల్‌లో అగ్ని ప్రమాదం.. 56 మంది అగ్నికి ఆహుతి

- March 26, 2018 , by Maagulf
షాపింగ్‌ మాల్‌లో అగ్ని ప్రమాదం.. 56 మంది అగ్నికి ఆహుతి

కిమిరోవ్‌: రష్యాలో షాపింగ్‌మాల్‌లో అగ్ని ప్రమాదంలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య 56కు చేరుకుంది. కిమిరోవ్‌ సిటిలో ఉన్న షాపింగ్‌మాల్‌లో ఈ దర్ఘటన జరిగింది. మాల్‌లో ఉన్న సినిమా హాల్స్‌, ప్లే ఏరియాలో మృతుల సంఖ్య ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. మరిణించిన వారిలో 11మంది చిన్నారులు ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో మరో 20 మంది ఆచూకీ లేరని అధికారులు తెలిపారు. షాపింగ్‌మాల్‌ నుంచి భారీ స్థాయిలో అగ్ని కీలలు వ్యాపించాయి. చిల్ట్రన్స్‌ ప్లే గ్రౌండ్‌ నుంచి మంటలు మొదలై ఉంటాయని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ప్లే గ్రౌండ్‌లో షార్ట్‌ సర్క్యూట్‌ కావడం వల్ల కూడా ఈ ప్రమాదం జరిగి ఉంటుందని మరో రకంగానూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com