t20 సిరీస్ నుంచి నిష్క్రమించిన భారత్
- March 26, 2018
వరుస ఓటములతో సిరీస్ నుంచి నిష్క్రమించింది భారత్. మహిళల ముక్కోణపు t20 సిరీస్ లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్ లో భారత్ హ్యాట్రిక్ ఓటమి నమోదుచేసింది. సోమవారం జరిగిన మహిళల మూడో t20 మ్యాచ్ లో భారత్ 36 పరుగుల తేడాతో ఓడిపోయింది. తొలుత టాస్ గెలిచిన భారత జట్టు ప్రత్యర్థిని బ్యాటింగ్ కు ఆహ్వానించింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆస్ట్రేలియా జట్టు 186 పరుగులు సాధించింది. అనంతరం 187 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 150 పరుగులకే అల్ అవుట్ అయింది. ఈ ఓటమితో భారత్ సిరీస్ కోల్పోయింది. అనుజా పాటిల్ 38 పరుగులు, పూజా 19 పరుగులు సాధించారు. ఇక వరుసగా మూడు ఓటములతో ఈ ట్రై సిరీస్ లో బెర్త్‌కు దూరమైంది భారత్. అయితే ఇంగ్లాండ్‌తో మరో నామమాత్రపు మ్యాచ్‌ను భారత్ ఆడనుంది.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







