కాంపిటిషన్ కేటగిరికి 'కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ' చిత్రం

- December 01, 2015 , by Maagulf
కాంపిటిషన్ కేటగిరికి 'కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ' చిత్రం

జైపూర్‌లో జరిగే ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ (జిఫ్‌)లో కాంపిటిషన్ కేటగిరికి 'కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ' చిత్రం ఎంపికైంది. సుధీర్‌బాబు, నందిత జంటగా నటించిన ఈ సినిమాకి హరి గౌర సంగీతం అందించారు. లగడపాటి శిరీష, లగడపాటి శ్రీధర్‌ కలిసి నిర్మించారు. ఆర్‌.చంద్రు దర్శకుడిగా రూపొందిన ఈ సినిమా తాజాగా జిఫ్‌కు కాంపిటిషన్ విభాగంలో నామినేట్‌ కావడం పట్ల చిత్ర నిర్మాత లగడపాటి శ్రీధర్‌ ఆనందాన్ని వ్యక్తం చేశారు. జైపూర్‌లో జనవరి 2 నుంచి 6వరకు జిఫ్‌-2016 ఉత్సవాలు జరగనున్నాయి. ఆ ఉత్సవాల్లో ఈ సినిమాను ప్రదర్శించనున్నట్టు కార్యక్రమ ఫౌండర్‌ మరియు డైరక్టర్‌ హనురోజ్‌ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com