రాజమౌళి మీద ఉన్న నమ్మకంతోనే ఆ పని చేశా - రామ్ చరణ్
- March 26, 2018
బాహుబలి తర్వాత రాజమౌళి ఆ అంచనాలను మించేలా మెగా నందమూరి మల్టీస్టారర్ కు సిద్ధం అవుతున్నాడు. ఎన్.టి.ఆర్, రాం చరణ్ లతో కలిసి రాజమౌళి చేయబోతున్న ఈ మూవీ ట్రిపుల్ ఆర్ అంటూ సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ముఖ్యంగా ఎన్.టి.ఆర్ ను రామారావుగా సంభోదించడం రాజమౌళి గట్స్ కు నిదర్శనం అని చెప్పొచ్చు.
డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాను 150 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారని తెలుస్తుంది. అయితే ఈ సినిమా కథ ఇంకా తాను వినలేదని షాక్ ఇచ్చాడు చరణ్. కేవలం రాజమౌళి మీద ఉన్న నమ్మకంతోనే కథ వినకుండా కాంబినేషన్ కు సై అన్నాడని అంటున్నాడు. అయితే కథ మొత్తం వినలేదు కాని కచ్చితంగా ఇది లైన్ అని జక్కన్న చెప్పే ఉంటాడని అంటున్నారు.
ప్రస్తుతం మరో మూడు రోజుల్లో రిలీజ్ అవబోతున్న రంగస్థలం ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న రాం చరణ్ రాజమౌళి సినిమా గురించి షాకింగ్ కామెంట్ చేశాడు. కేవలం రాజమౌళి మీద ఉన్న కాన్ఫిడెంట్ మీదే ఈ మెగా మల్టీస్టారర్ కు ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. అయితే కథ వినకుండా ఓకే చేసినందుకు మెగా ఫ్యాన్స్ మాత్రం కొంత అసహనంలో ఉన్నారు.
రంగస్థలం తర్వాత బోయపాటి శ్రీను సినిమా చేస్తున్న రాం చరణ్ ఆ సినిమా బోయపాటి మార్క్ మాస్ అండ్ కమర్షియల్ అంశాలతో వస్తుందని తెలుస్తుంది. తప్పకుండా 2018, 19 ఇయర్ లలో చెర్రి తన స్టామినా ప్రూవ్ చేసుకునే అవకాశం ఉందని అతను చేస్తున్న సినిమాలను బట్టే చెప్పేయొచ్చు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..