రస్‌ అల్‌ ఖైమాలో 25 ఏళ్ళ వ్యక్తి మిస్సింగ్‌

- March 26, 2018 , by Maagulf
రస్‌ అల్‌ ఖైమాలో 25 ఏళ్ళ వ్యక్తి మిస్సింగ్‌

రస్‌ అల్‌ ఖైమా పోలీస్‌, గల్ఫ్‌ పౌరుడొకరు 'మిస్సింగ్‌' అయ్యారనీ, అతని ఆచూకీ తెలపడంలో సహకరించాలని పబ్లిక్‌కి విజ్ఞప్తి చేశారు. హుమైద్‌ బిన్‌ మొహమ్మద్‌ బిన్‌ సలెమ్‌ అల్‌ మెనబాలీ, గత కొన్ని రోజులుగా కన్పించడంలేదని అతని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మానసికంగా డిస్టర్బ్‌ అయిన అల్‌ మెక్బాలి, సోదరి భర్తతో కలిసి నఖీల ప్రాంతంలో గత రెండేళ్ళుగా నివసిస్తున్నారు. అల్‌ మెక్బాలీ బంధువు అబ్దుల్లా అల్‌ షెహి మాట్లాడుతూ, ఎప్పుడూ తీవ్ర మనస్తాపంతో బాధపడుతుండేవాడనీ, ఆ సమయాల్లో గ్రాసరీస్‌ కోసం బయటకు వెల్ళి, రిలాక్స్‌ అయ్యాక వచ్చేవాడనీ చెప్పారు. గత గురువారం బయటకు వెళ్ళి తిరిగి రాలేదనీ, మొబైల్‌ ఫోన్‌, ఐడెంటిటీ డాక్యుమెంట్స్‌ని కూడా తనతో తీసుకెళ్ళలేదని అల్‌ సెహి వివరించారు. బంధువులు, స్నేహితుల ఇళ్ళకూ అల మెక్‌బాలీ వెళ్ళలేదని వారు చెబుతున్నారు. ఎవరైనా అతని ఆచూకీ కనుగొంటే, వెంటనే తమకు సమాచారమివ్వాలని అల్‌ మెక్బలి బంధువులు విజ్ఞప్తి చేస్తున్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com