రంగమ్మత్తతో చిట్టిబాబు
- March 27, 2018
సుకుమార్-రాంచరణ్ కాంబినేషన్ లో సమంత హీరోయిన్ గా వస్తున్న 'రంగస్థలం' విడుదలకు కౌంట్ డౌన్ ప్రారంభం కావడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ వేగం పెంచారు. ఇప్పటికే పాటలకు సంబంధించి ఒక్కో ప్రోమో, మేకింగ్ వీడియో రిలీజ్ చేస్తున్నారు. ఆడియో సాంగ్స్ సింగిల్స్ తో మొదలుపెట్టి.. ప్రీ రిలీజ్ ఫంక్షన్ దాకా 'రంగస్థలం' యూనిట్ పక్కా స్కెచ్ తో ప్రచారం చేసుకుంటూ వచ్చారు.
ఇక ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత ఆ అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ చిత్రం ఈనెల 30వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. ఇందులో సమంత హీరోయిన్ కాగా, రంగమ్మత్తగా హాట్ యాంకర్ అనసూయ నటిస్తోంది. ఈ నేపథ్యంలో రంగమ్మత్త క్యారెక్టర్‌లో అనసూయ ఫొటోలు ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
తాజాగా, రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా, అనసూయ మరో రెండు ఫొటోలను తన ఫేస్‌బుక్, ట్విట్టర్ అకౌంట్లలలో పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా రాంచరణ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది. ఈ ఏడాదంతా బ్లాక్ బస్టర్ గా నిలిచిపోవాలని ఆకాంక్షించింది. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..