తృణమైన ఆమె

- December 01, 2015 , by Maagulf

 

ఏడడుగులు నడచి వాగ్దానాలెన్నో చేసిన
ఒప్పందం ఒకటి ఇచ్చిన మాట ఒకటైనా నిలబెట్ట
కట్టుకున్న దాన్ని ఆమె కడుపులో కాసిన కాయల్ని 
కడుపు ఎండ బెట్ట లేక, సంసారాన్ని గూడులోనే వదిలెల్లితే .. 

ఆమె పాలిచ్చి సాకిన పసి కూన ఒకటి రెక్కలొచ్చి 
బ్రతుకు తెరువు నేర్పిన కన్నవారి బాటలోనే 
తీరం దాటి ఎగిరెల్లిన వారసత్వం ఒకటి 

తన కోసమే మరో తల్లిని కనీ, కరుణ తో పెంచుకుంటున్నా.. 
యవ్వనంతో ఎదుగుతున్న కన్న పేగుని మురిపెంగా చూసుకొని 
విడవను లేక అట్టే పెట్టుకోను లేక, విల విల లాడుతూ 
గుండె భారం పెంచుకునే.. మాతృ హృదయాన్ని వీడి

చేతులు నిండే అన్ని యోగ్యతలతో పాటు, వరుడు 
మరో డిగ్రీ ఎక్కడడుగుతాడో అని,మరో పీజీ కై 
అహిష్టమైన ముద్దను గొంతులో వేసుకొంటూ 
భారమైన కాలాన్ని చూస్తూ నిస్తేజంగా,
ఎక్కడో భాలికల నిర్భంధాలయాల్లో 
లేలేత ప్రాయం..ఇంకొకటి 

అయినా గుండె నిబ్బరంతో ఆమె
ఎండి గింజలు విదుల్చుకున్న పొలాల్లో 

జీవితం నిస్వార్థంగా అర్పించి, ఎండు కట్టెగా బ్రతుకుతున్న తను
తనకిపుడు పాలు పట్టే తోడు .. తన పాడి గేదె కోసం, తన పాలు 
త్రాగుతున్న దాని ఋణం కోసం,,తనవారి అందరికోసం తృణమైన ఆమె 


--జయ రెడ్డి బోడ(అబుధాబి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com