తృణమైన ఆమె
- December 01, 2015
ఏడడుగులు నడచి వాగ్దానాలెన్నో చేసిన,
ఒప్పందం ఒకటి ఇచ్చిన మాట ఒకటైనా నిలబెట్ట,
కట్టుకున్న దాన్ని ఆమె కడుపులో కాసిన కాయల్ని
కడుపు ఎండ బెట్ట లేక, సంసారాన్ని గూడులోనే వదిలెల్లితే ..
ఆమె పాలిచ్చి సాకిన పసి కూన ఒకటి రెక్కలొచ్చి
బ్రతుకు తెరువు నేర్పిన కన్నవారి బాటలోనే
తీరం దాటి ఎగిరెల్లిన ఆ వారసత్వం ఒకటి
తన కోసమే మరో తల్లిని కనీ, కరుణ తో పెంచుకుంటున్నా..
యవ్వనంతో ఎదుగుతున్న కన్న పేగుని మురిపెంగా చూసుకొని
విడవను లేక అట్టే పెట్టుకోను లేక, విల విల లాడుతూ
గుండె భారం పెంచుకునే.. ఆ మాతృ హృదయాన్ని వీడి,
చేతులు నిండే అన్ని యోగ్యతలతో పాటు, వరుడు
మరో డిగ్రీ ఎక్కడడుగుతాడో అని,మరో పీజీ కై
అహిష్టమైన ముద్దను గొంతులో వేసుకొంటూ
భారమైన కాలాన్ని చూస్తూ నిస్తేజంగా,
ఎక్కడో భాలికల నిర్భంధాలయాల్లో
ఆ లేలేత ప్రాయం..ఇంకొకటి
అయినా గుండె నిబ్బరంతో ఆమె,
ఎండి గింజలు విదుల్చుకున్న పొలాల్లో
జీవితం నిస్వార్థంగా అర్పించి, ఎండు కట్టెగా బ్రతుకుతున్న తను,
తనకిపుడు పాలు పట్టే తోడు .. తన పాడి గేదె కోసం, తన పాలు
త్రాగుతున్న దాని ఋణం కోసం,,తనవారి అందరికోసం తృణమైన ఆమె
--జయ రెడ్డి బోడ(అబుధాబి)
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







