అబుదాబీ లో కుప్ప కూలిన క్రేన్: ఏడు కార్లు ధ్వంసం
- March 27, 2018
అబుదాబీ: అబుదాబీలోని నిర్మణంలో వున్న ఓ భవనంలో క్రేన్ కుప్పకూలిన ఘటనలో ఏడు కార్లు ధ్వంసమయ్యాయి. టూరిస్ట్ క్లబ్ ప్రాంతంలో సోమవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. సంఘటన గురించి తెలియగానే, సివిల్ డిఫెన్స్, రెస్క్యూ టీమ్స్, పోలీస్ పెట్రోల్స్ ఘటనా స్థలానికి చేరుకుని, సహాయక చర్యలు ముమ్మరం చేసినట్లు అబుదాబీ పోలీస్ వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలూ అవలేదు. ఘటన జరిగిన ప్రాంతంలో పార్కింగ్ చేసి వున్న వాహనాల మీద క్రేన్ కుప్పకూఇందని అబుదాబీ సివిల్ డిఫెన్స్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ జనరల్ బ్రిగేడియర్ మొహమ్మద్ మయౌఫ్ అల్ కెత్బి చెప్పారు. క్రేన్ కుప్పకూలడానికి కారణాల్ని కనుగొనే ప్రయత్నంలో ఉన్నారు పోలీసులు. కన్‌స్ట్రక్షన్ ప్రాంతాల్లో ప్రమాదాలకు అవకాశమీయకుండా నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా పోలీసులు సూచించారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







