చర్చి గోయెర్స్‌కి దుబాయ్ పోలీసుల సూచన
- March 27, 2018
దుబాయ్ - సెంట్ మేరీస్ కేథలిక్ చర్చ్, ఈస్టర్ సందర్భంగా చర్చికి వచ్చేవారికి ఓ సూచన చేసింది. మార్చి 29 నుంచి ఏప్రిల్ 1 వరకు జరిగే ప్రత్యేక ప్రార్థనల నిమిత్తం పెద్ద సంఖ్యలో వచ్చే భక్తులు, తమతోపాటు పెద్ద సైజులో వుండే బ్యాక్ ప్యాక్స్‌ని తీసుకురావొద్దని సూచించింది. బ్యాగ్‌లను పరీక్షించడం జరుగుతుందనీ, అనుమానిత వస్తువుల్ని స్వాధీనం చేసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు నిర్వాహకులు. దుబాయ్ పోలీసుల సూచన మేరకే ఈ చర్యలు చేపట్టామని వారంటున్నారు. అయితే ఇది రొటీన్‌గా జరిగే వ్యవహారమేననీ, భద్రతా పరమైన ఆంక్షలు తప్పనిసరని వారు వివరించారు. పెద్ద సంఖ్యలో జనం పోగయ్యేటప్పుడు అనుకోని ఘటనలు చోటు చేసుకోవచ్చు కాబట్టి, ముందస్తు జాగ్రత్త అవసరమని కేథలిక్ చర్చి ప్రతినిథులు చెప్పారు.
తాజా వార్తలు
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!







