ఐపిఎల్ విజేతకు నగదు పెంపు
- March 27, 2018
ముంబాయి : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) విజేతకు ఇచ్చే నగదును బీసీసీఐ పెంచింది. గత ఏడాది విజేత జట్టుకు రూ.15 కోట్లు ఇవ్వగా ఈసారి టోర్నీ విజేతగా నిలిచే జట్టుకు ఇచ్చే మొత్తాన్ని 26 కోట్ల రూపాయలకు పెంచింది. ఫైనల్లో ఓడిన (రన్నరప్) జట్టుకు గత ఏడాది రూ. 10 కోట్లు ముట్ట జెప్పగా ఆ మొత్తాన్ని ఈసారి రూ.13 కోట్లకు పెంచారు. అంతేగాక ఐపీఎల్లో మొత్తం ప్రైజ్‌మనీ ద్వారా ఆటగాళ్లకు రూ.56 కోట్లు దక్కనున్నాయి. ప్రతి మ్యాచ్‌లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌తో పాటు మ్యాన్ ఆఫ్ ది సిరీస్, అత్యధిక పరుగులు, అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్లకు లక్ష రూపాయల చొప్పున బహుమతులు ఇవ్వనున్నారు.అవన్నీ కలుపుకుంటే సుమారు రూ.56 కోట్ల రూపాయల వరకు ఆటగాళ్లకు ప్రైజ్‌మనీ రూపంలో ఇవ్వనున్నారు. ఈ ఏడాది ఈ మెగా ఐపీఎల్ టోర్నీ ఏప్రిల్ 7న ప్రారంభంకానుంది.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







