ఐడియా ఇవ్వు..10 లక్షలు పట్టు: భారతీయ రైల్వే

- March 27, 2018 , by Maagulf
ఐడియా ఇవ్వు..10 లక్షలు పట్టు: భారతీయ రైల్వే

అవును మీరు విన్నది నిజమే.. ! ఒక్క ఐడియాతో అక్షరాలా రూ.10లక్షలు సంపాదించవచ్చు. కేంద్రమే ఈ ఆఫర్ ను ప్రకటించింది. భారతీయ రైల్వే తన సేవలను మరింతగా మెరుగుపరుచుకునేందుకు ప్రజల నుంచి సలహాలను స్వీకరించే పనిలో పడింది.

ఆదాయాన్ని పెంచుకొనేందుకు ఒక ఐడియా చెప్పండంటూ ఇండియన్ రైల్వేస్ ప్రజలను కోరుతోంది. బెస్ట్ ఐడియా ఇస్తే రూ.10లక్షలు ఇస్తామని, రెండో ఐడియాకు రూ.5లక్షలు, మూడో ఐడియాకు రూ.3లక్షలు, నాలుగో ఐడియాకి రూ.లక్ష వరకూ ఇస్తామని భారతీయ రైల్వే శాఖ వెల్లడించింది. ఆదాయాన్ని మెరుగుపరుచుకొనేందుకు ఈ ఆలోచన చేసినట్లు తెలిపింది. మంచి సలహాలు ఇవ్వాలనుకునువారే https://innovate.mygov.in/jan-bhagidari . అనే వెబ్‌సైట్ ద్వారా పూర్తి వివరాలు చూడవచ్చు. దీనికి చివరి తేదీగా 2018, మే 19 నిర్ణయించారు.

'మెరుగైన సేవలు ద్వారా అధిక ఆదాయం పొందేందుకు భారతీయ రైల్వేలు ప్రజల నుంచి సలహాలను స్వీకరిస్తోంది. ఇదో మంచి అవకాశం. దీని ద్వారా మిమ్మల్ని మీరు నిరూపించుకున ే అవకాశం ఉంటుందని' జెన్‌ భగీదరీ వెబ్‌సైట్‌ అధికారి తెలిపారు. 'ఐడియా పూర్తి బిజినెస్‌ ప్లాన్‌గా ఉండాలి. రైల్వే ఆదాయాన్ని పెంచేందుకు అది ఉపయోగపడాలి' ఆ వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు.అయితే ఈ పోటీ మొత్తం మూడు దశల్లో ఉంటుంది. మొత్తం 1000పదాలలో మీ ఐడియా ఇస్తే చాలు. మరి ఇంకేందుకు ఆలస్యం.. ఆ ఐడియాయేదో చెప్పేసి రూ.10లక్షలు సంపాదించుకోండి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com