కాగ్నిజెంట్ టెక్నాలజీకి షాక్ - బ్యాంకు ఖాతాలు సీజ్
- March 27, 2018
ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఆదాయపు పన్నును ఎగవేసిందన్న ఆరోపణలపై ప్రముఖ ఐటీ సేవల సంస్థ కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు ఐటీ శాఖ షాకిచ్చింది. సంస్థకు చెందిన వివిధ బ్యాంకు ఖాతాలను సీజ్ చేస్తున్నట్టు ప్రకటించింది. కాగ్నిజెంట్ నుంచి 2016-17 సంవత్సరానికిగాను రూ. 2500 కోట్లకు పైగా టాక్స్ రావాల్సి వుందని ఆదాయ పన్ను శాఖ అధికారులు వెల్లడించారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ టాక్స్ (డిటిటి)ను సంస్థ ఇప్పటి వరకూ చెల్లించ లేదని సీనియర్ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఈ విషయంలో సంస్థకు నోటీసులు పంపినా స్పందించలేదని, దీంతో చెన్నై, ముంబైలోని కాగ్నిజెంట్ బ్యాంకు ఖాతాలను సస్పెండ్ చేసి స్వాధీనం చేసుకున్నామని అన్నారు. కాగా, తమ ఖాతాలను స్తంభింపజేయడంపై కాగ్నిజెంట్ మద్రాసు హైకోర్టును ఆశ్రయించింది. తాము అన్నిబకాయిలను చెల్లించామని సంస్థ ప్రతినిధి ఒకరు వివరణ ఇచ్చారు. మరిన్ని వివరాలను అందించడానికి మాత్రం ఆయన నిరాకరించడం గమనార్హం.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..