చైనాలో 'కిమ్' రహస్య పర్యటన నిజమే!

- March 27, 2018 , by Maagulf
చైనాలో 'కిమ్' రహస్య పర్యటన నిజమే!

ఊహించిందే నిజమైంది. నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ చైనాలో రహస్య పర్యటనకు వెళ్లారు. ఈ విషయాన్ని రెండు దేశాలు ధృవీకరించాయి. ఆదివారం నుంచి బుధవారం వరకు కిమ్ చైనాలో అనధికారికంగా పర్యటించినట్లు చైనాకు చెందిన ఓ న్యూస్ వెల్లడించింది. 2011లో నార్త్ కొరియా పగ్గాలు చేపట్టిన తర్వాత కిమ్ తొలిసారి దేశం దాటి బయటకు వచ్చారు. నార్త్ కొరియాకు చైనా ఎప్పటి నుంచో గట్టి మద్దతుదారుగా ఉంది. అయితే ఆ దేశం చేపట్టిన అణు కార్యక్రమాలతో ఈ బంధం కాస్త బలహీన పడింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com