మెట్రోరైలులో తొలిసినిమా షూటింగ్

- March 28, 2018 , by Maagulf
మెట్రోరైలులో తొలిసినిమా షూటింగ్

హైదరాబాద్‌లో మెట్రో కల నిజమైంది. అఖిల్ నటించిన హలో మూవీ తొలి సారి మెట్రో స్టేషన్‌లో చిత్రీకరణ జరుపుకుంది. ఇక తాజాగా నాగ్‌-నాని మల్టీ స్టారర్ మూవీ మెట్రో ట్రైన్‌లో షూటింగ్ జరుపుకుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం తెలిపింది. మియాపూర్‌లోని మెట్రో స్టేషన్‌లో ఉన్న మెట్రో ట్రైన్‌లో కొన్ని సీన్స్ షూట్ చేశారు. తొలిసారి మెట్రో ట్రైన్‌లో షూటింగ్ జరుపుకున్న తొలి చిత్రం ఇదే అని అంటున్నారు మేకర్స్‌. నాని, రష్మిక మంధన తో పాటు సంపూర్ణేష్ బాబుపై మెట్రో ట్రైన్‌లో కొన్ని సీన్స్ తెరకెక్కించారట.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com