కరాకస్:జైలులో అగ్నిప్రమాదం.. 68 మంది మృతి
- March 28, 2018
కరాకస్: వెనిజులాలో దారుణం జరిగింది. వలెన్షియా సిటీలోని పోలీస్ స్టేషన్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో సుమారు 68 మంది మృతిచెందారు. జైలు వద్ద అల్లర్లు జరగడంతో పోలీసులు ఫైరింగ్‌కు దిగారు. అదే సమయంలో అక్కడ భారీ అగ్ని ప్రమాదం జరిగంది. కారాబోబో రాష్ట్రంలో ఈ ఘటన జరిగింది. ఈ విషాద ఘటన పట్ల విచారణ నిర్వహించనున్నట్లు ఆ రాష్ట్ర మంత్రి తెలిపారు. జైలు నుంచి బయటపడాలన్న ఉద్దేశంతో ఖైదీలు అక్కడున్న మంచాలకు నిప్పుపెట్టారు. దీంతో అక్కడ భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. అదే సమయంలో పోలీస్ స్టేషన్ ముందున్న వారిని తరిమేందుకు పోలీసులు టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు. ఓ పోలీస్‌ను అల్లరి మూకలు కాల్చి చంపినట్లు సమాచారం.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







